తక్కువ ధరకే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్... 2 m ago
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కి తొలి స్థానం ఉంది. దీని తర్వాత బజాజ్ ఆటో, టీవీఎస్ ఎలక్ట్రిక్,ఏథెర్ వంటి ఎలక్ట్రిక్ టూవీలర్స్ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి.భారత మార్కెట్లో 30 శాతానికి పైగా వాటాను ఓలా ఎలక్ట్రిక్ కలిగి ఉంది.ప్రస్తుతం రానున్న పండుగ సీజన్లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఓలా మంచి డిస్కౌంట్ లను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఓలా ఎస్1X-2 కిలో వాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 49,999కే లభిస్తుంది. ఈ బెనిఫిట్స్ ని నేటి నుంచి పొందవచ్చు. అలాగే S 1 సిరీస్ స్కూటర్ల పై 10,000 రూ వరకు తగ్గింపు ప్రకటించారు. ఇందులో 5000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఇంకా అదనపు బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు అని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.